నాయక్ హైలైట్స్
posted on Jan 9, 2013 @ 9:38AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "నాయక్" తో కొత్త సంవత్సరంలో టాలీవుడ్ కి తొలి సూపర్ హిట్ ఇవ్వాలని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీ హైలైట్స్ మీ కోసం:
నాయక్ గా రామ్ చరణ్ అద్బుతంగా నటించాడు. ఆయన వాయిస్ మొడ్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేశారు. ఈ సినిమాలో చరణ్ డాన్సు లు చాలా బాగున్నాయి. “లైలా ఓ లైలా” మరియు "హే నాయక్” పాటలలో చరణ్ డాన్సు తో అదరగొట్టాడు.
కాజల్ సినిమాలో చాలా అందగా కనిపించింది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ కెమిస్ట్రీ బాగుంది. అమలా పాల్ కి పెద్ద ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు ఓన్లీ పాటల వరకే పరిమితమైంది.
బ్రహ్మానందం జిలేబి పాత్ర సినిమాకి హైలైట్. తన కామెడీ తో ఆడియన్స్ ని కడుపుబ్బనవ్విస్తారు. కోల్ కత్తా లో క్రిమినల్ గా పోసాని కృష్ణ మురళి చాలా బాగా నటించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే చాక్లెట్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఎంఎస్ నారాయణ సి.బి.ఐలో తాగుబోతు లిప్ రీడింగ్ స్పెషలిస్ట్ గా, రాహుల్ దేవ్ కి పెద్దన్న పాత్రలో జయప్రకాశ్ రెడ్డి బాగా నటించారు.
నాయక్ ఫస్ట్ హాఫ్ రామ్ చరణ్, బ్రాహ్మనందం మధ్య కామెడీ సన్నివేశాలతో వేగంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో కొంచే బోరింగ్ గా ఉంటుంది. వినాయక్ సెకండ్ హాఫ్ పై కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేదని అంటున్నారు.
ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి ప్రధాన ఆకర్షణ గా చెప్పుకోవచ్చు. ఐస్ ల్యాండ్ లో చిత్రీకరించిన పాటలు చాలా అద్బుతంగా ఉన్నాయి. తమన్ మ్యూజిక్ సినిమా విడుదల ముందే హిట్ అయింది. వి వి వినాయక్ "నాయక్" తో కథలో కొత్తదనం చూపించలేకపోయినా చిత్రాన్ని వినోదాత్మకంగా మరియు వేగవంతంగా నడిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.